News March 10, 2025

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

AP: ECET-2025 నోటిఫికేషన్‌ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా చదువుతున్న వారు ఇంజినీరింగ్, ఫార్మసీ సెకండియర్ సహా మరికొన్ని కోర్సుల్లో చేరవచ్చు. మే 6వ తేదీన ఉ.9-12 వరకు, మ.2-5 వరకు పరీక్ష జరుగుతుంది.

Similar News

News March 11, 2025

ప్రభుత్వ సలహాదారుగా దత్తాత్రేయుడు: సీఎం

image

AP: ప్రముఖ క్యాన్సర్ వైద్యులు <<15716479>>దత్తాత్రేయుడిని <<>>ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకోనున్నట్లు CM చంద్రబాబు చెప్పారు. సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని గుర్తుచేశారు. 50 ఏళ్లుగా క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలు అందించారని వివరించారు. ఎన్నో పెద్ద యూనివర్సిటీల నుంచి చాలామంది దత్తాత్రేయుడి వద్ద వైద్యం నేర్చుకున్నారని తెలిపారు. ఆయన సలహాలతో క్యాన్సర్ నివారణ చర్యలు చేపడతామన్నారు.

News March 11, 2025

ఘోరం: పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

image

TG: హైదరాబాద్‌లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు చంద్రశేఖర్(40), కవిత(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News March 11, 2025

బండి సంజయ్ జోక్యంతో భారతీయులకు విముక్తి

image

థాయ్‌లాండ్‌లో బందీలుగా మారిన 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో 540 మందిని సైబర్ నేరగాళ్లు బందీలుగా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో బాధితులకు విముక్తి లభించగా, ప్రత్యేక విమానంలో వారంతా భారత్‌కు చేరుకున్నారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన యువత అధికంగా ఉన్నారు.

error: Content is protected !!