News July 14, 2024
ALERT.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.
Similar News
News October 14, 2024
బాబా సిద్దిఖీ హత్య.. అసలెవరీ లారెన్స్ బిష్ణోయ్
సల్మాన్ ఖాన్ ఫ్రెండ్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. 30 ఏళ్ల బిష్ణోయ్ చండీగఢ్‌లో చదువుకునే సమయంలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయమైంది. ఆ తర్వాత అతడితో కలిసి నేరాలకు పాల్పడ్డాడు. 2012 నుంచి ఆయన ఎక్కువ జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అనుచరులను కలుస్తాడు. తమకు ఇష్టమైన కృష్ణ జింకలను చంపాడనే కోపంతో సల్మాన్‌పై పగబట్టాడు.
News October 14, 2024
వెల్లుల్లి తింటే చనిపోయే వ్యాధి గురించి తెలుసా?
చాలామందికి వెల్లుల్లి లేకుండా వంట చేయడం కష్టమే. కానీ వెల్లుల్లి పొరపాటున తిన్నా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఓ వ్యాధి ఉందంటే నమ్ముతారా? దీని పేరు ‘అక్యూట్ ఇంటెర్మిటెంట్ పోర్ఫైరా’. వెల్లుల్లిలో అధికంగా ఉండే సల్ఫర్ పడనివారికి ఈ సమస్య వస్తుంది. రోజుల తరబడి వాంతులు, మలబద్ధకం, తీవ్రమైన తలనొప్పి దీని లక్షణాలు. ఇవి ఉన్నవారు వెల్లుల్లి సహా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News October 14, 2024
సాధారణ వైద్య సేవలు బంద్: వైద్యుల సంఘం
కోల్‌కతాలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్(FAIMA) పిలుపునిచ్చింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. బెంగాల్ సీఎం మమత నుంచి తమకు సరైన స్పందన రాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.