News July 19, 2024
ALERT: రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం
TG: రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వానలు పడతాయని IMD <<13657926>>హెచ్చరించింది<<>>. ఈనేపథ్యంలో రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, MBNR, నాగర్‌కర్నూల్, NLG, నారాయణపేట్, నిర్మల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
Similar News
News December 13, 2024
మార్చి 3 నుంచి TG ఇంటర్ పరీక్షలు?
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 3 నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని చూస్తోంది. త్వరలోనే ఇంటర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ షెడ్యూల్ ప్రకటించనుంది. మరోవైపు ఇప్పటికే ఏపీలో <<14851951>>ఇంటర్<<>>, <<14851568>>టెన్త్<<>> షెడ్యూల్ విడుదలైంది.
News December 13, 2024
క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు
మీడియాపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు TV9కి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ‘నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నాను. ఘటన అనంతరం 48 గంటల పాటు ఆస్పత్రిపాలు కావడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, టీవీ9కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొన్నారు.
News December 13, 2024
అత్యుత్తమ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ
హైదరాబాద్ బిర్యానీ మరోసారి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకుంది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ వంటకాల్లో బిర్యానీ 31వ స్థానం దక్కించుకుంది. మొత్తం 15,478 వంటకాలు ఈ పోటీలో నిలవగా బిర్యానీ ఈ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కొలంబియాకు చెందిన లెచోనా వంటకం అగ్రస్థానం దక్కించుకుంది. దక్షిణ భారత వంటకాలను రుచి చూపించే రెస్టారెంట్లలో ITC కోహినూర్ మూడో స్థానంలో ఉంది.