News October 18, 2024
ALERT.. కాసేపట్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, గద్వాల్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, నారాయణ్‌పేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Similar News
News November 12, 2024
శత్రుదాడి జరిగితే పరస్పర రక్షణకు రష్యా, నార్త్ కొరియా డీల్
శత్రుదేశాలు యుద్ధానికి వస్తే ఒకరికొకరు సహాయంగా నిలబడేలా రష్యా, ఉత్తర కొరియా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఈ ఒప్పందం జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య సహకారం ఇటీవల బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్యాంగ్యాంగ్‌కు రష్యా ఆయుధ సాంకేతికత సరఫరా చేస్తుండగా అటు కిమ్ జాంగ్ వేలాదిమంది సైనికుల్ని ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యాకు సరఫరా చేస్తున్నారు.
News November 12, 2024
ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా మనిషి ట్రాకింగ్!
మనిషి ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా అతడి చివరి లొకేషన్‌ను గుర్తించే మైక్రోబయోమ్ జియోగ్రఫిక్ పాపులేషన్ స్ట్రక్చర్(mGPS) అనే AI సాంకేతికతను స్వీడన్ పరిశోధకులు రూపొందించారు. ఓ వ్యక్తి ప్రయాణించిన ప్రాంతంలో అతడి శరీరం తాలూకు సూక్ష్మక్రిములు ఉంటాయని, తమ సాంకేతికత ఆ క్రిముల ద్వారా అతడి లోకేషన్‌ని గుర్తిస్తుందని వారు వివరించారు. దీని ద్వారా రోగాల వ్యాప్తిని గుర్తించడం సులువవుతుందని తెలిపారు.
News November 12, 2024
BJPని కుక్కలా మార్చే టైమొచ్చింది: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే సరికొత్త వివాదానికి తెరలేపారు. OBC కమ్యూనిటీతో BJP తీరును విమర్శిస్తూ ఆ పార్టీ నేతలను కుక్కలుగా మార్చాలన్నారు. ‘అకోలా జిల్లా ఓబీసీలను నేనొకటే అడుగుతున్నా. మిమ్మల్ని కుక్కలని పిలుస్తున్న బీజేపీకి ఓటేస్తారా? ఇప్పుడు బీజేపీని కుక్కలా మార్చే టైమొచ్చింది. వాళ్లకు అహంకారం తలకెక్కింది’ అని అకోలా సభలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అధికార మహాయుతి కూటమి భగ్గుమంది.