News December 6, 2024
ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలు చోట్ల రేపు తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదని, పలు జిల్లాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని తెలిపింది.
Similar News
News January 16, 2026
వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికం అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్ వంటివి చేసి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.
News January 16, 2026
‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజు పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈ రోజున ప్రయాణాలు వద్దంటారు. అంతే కాకుండా భోగి, సంక్రాంతి హడావుడిగా అయిపోతాయి. అందరూ కలిసి సరదాగా గడపడం కోసం కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం వద్దంటారు.
News January 16, 2026
ట్రంప్ కొంతైనా ‘శాంతి’స్తారా?

అధికారికంగా కాకపోయినా ట్రంప్ చేతికి <<18868941>>నోబెల్ పీస్ ప్రైజ్<<>> అందింది. దీంతో కొంతైనా శాంతించి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మచాడో వెనిజులా అధ్యక్షురాలు అవుతారని కొందరు, ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవాలని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా తనకు కాకుండా వెనిజులాకు చెందిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడంతోనే ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి.


