News September 4, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, NTR జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు పడతాయంది.

Similar News

News September 7, 2024

చవితి శుభాకాంక్షలు తెలిపిన డేవిడ్ వార్నర్

image

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. స్వతహాగా భారతీయుడు కాకపోయినా ఇక్కడి రీల్స్, సినీతారల స్టెప్స్ వేస్తూ వార్నర్ దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆయన ప్రస్తుతం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News September 7, 2024

ప్రభుత్వ కాలేజీల్లో చదివే వారికి గుడ్‌న్యూస్

image

TG: ప్రభుత్వ జూ.కాలేజీల్లో విద్యార్థులకు EAPCET, NEET, JEE వంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనుంది. రాష్ట్రంలోని 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, వాటిలో ఏటా 80వేల మంది ఫస్టియర్‌లో చేరుతున్నారు. వీరు EAPCETలో ఉత్తీర్ణత సాధించి బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరితే ప్రభుత్వం పూర్తి రీయింబర్స్‌మెంట్ చేస్తోంది.

News September 7, 2024

వాయు, శబ్ద కాలుష్యంతో సంతానలేమి సమస్యలు

image

అధిక కాలం వాయు కాలుష్యానికి ప్ర‌భావితం కావ‌డం వ‌ల్ల పురుషుల్లో, ట్రాఫిక్ శబ్దాల వ‌ల్ల‌ మహిళల్లో సంతాన‌లేమి స‌మ‌స్య‌లు పొంచి ఉన్నాయ‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. PM2.5కు గురికావడం అనేది వయస్సుతో సంబంధం లేకుండా పురుషుల్లో వంధ్యత్వ సంభావ్యతతో ముడిపడి ఉందని డెన్మార్క్ పరిశోధకులు వెల్లడించారు. ట్రాఫిక్ శబ్దాలు 35 ఏళ్లు పైబడిన మహిళల్లో, 37 ఏళ్లు పైబడిన పురుషుల్లో స‌మ‌స్య‌లకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.