News July 11, 2024
ALERT: ఏపీలో రేపు పిడుగులతో వర్షాలు

AP: ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రేపు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని తెలిపింది. విజయనగరం, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News April 19, 2026
చరిత్రకు సజీవ సాక్ష్యం.. కొల్లాపూర్ కోట

చారిత్రక కట్టడాలకు నిలయమైన కొల్లాపూర్ సందర్శకులను కట్టిపడేస్తోంది. ఇక్కడి రాజాబంగ్లాలోని మంత్రమహల్, చంద్రమహల్, రాణిమహల్ భవనాలు అప్పటి నిర్మాణ శైలికి అద్దం పడుతున్నాయి. 1884లో నిర్మించిన ఈ కట్టడాలతో పాటు, రాజకుటుంబీకుల కోసం ఏర్పాటు చేసిన తోటబంగ్లా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ కోటలను చూసేందుకు చరిత్ర ప్రేమికులు తరలివస్తున్నారు.
News April 19, 2026
RTC ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుందా?

TG: ఈ నెల 22 నుంచి RTC ఉద్యోగులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో జీతాల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021, 2025 వేతన సవరణలు పెండింగ్‌లో ఉండగా, ఒక విడత వేతన సవరణ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. 7 లేదా 8% ఫిట్‌మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మిక నేతలతో చర్చించి ఫిట్‌మెంట్‌ను 10% మించకుండా ఖరారు చేసే ఛాన్సుందని, మరో వేతన సవరణపైనా హామీ ఉండొచ్చని సమాచారం.
News April 19, 2026
RRR నిర్మాణం.. ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr పరిహారం!

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం పంపిణీ కొనసాగుతోంది. సంగారెడ్డి(D) సదాశివపేట(M) పెద్దాపూర్ పరిధిలోని భూములకు ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr, కనిష్ఠంగా దౌల్తాబాద్ శివారు భూములకు ఎకరానికి ₹16L ఇస్తున్నట్లు సమాచారం. RRR కోసం సంగారెడ్డి CALA పరిధిలో 526 ఎకరాలు అవసరమని NHAI నిర్ణయించింది. ఇప్పటివరకు నిర్వాసితులకు ₹119.50Cr చెల్లించారు.


