News September 22, 2024

ALERT.. కాసేపట్లో పిడుగులు, వర్షాలు

image

TG: మరికాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 1-2 గంటల్లో తూర్పు హైదరాబాద్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మెదక్, వనపర్తిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Similar News

News September 3, 2025

హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి: VHP నేతలు

image

APలోని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఎండోమెంట్ చట్టాన్ని సవరించాలని VHP నేతలు CM చంద్రబాబును కోరారు. ఈ మేరకు అందించిన నమూనా డ్రాఫ్టును పరిశీలిస్తానని ఆయన సానుకూలంగా స్పందించినట్లు VHP కేంద్రీయ సంఘటనా కార్యదర్శి మిలింద్ పరాండే, కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. CMను కలిసిన వారిలో భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

News September 3, 2025

2 వారాల్లో రూ.18కోట్లు చెల్లించండి: సుప్రీం కోర్టు

image

AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేశారంటూ గతంలో జేపీ వెంచర్స్‌కు NGT రూ.18 కోట్లు జరిమానా విధించింది. ఆ ఫైన్‌ను 2 వారాల్లో చెల్లించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో NGT జరిమానాపై గతంలో విధించిన స్టేను ఎత్తేసింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్‌ను SC స్వీకరించి విచారణ జరిపింది.

News September 3, 2025

ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ, జొమాటో

image

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో తమ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. ప్లాట్‌ఫామ్ ఫీజులను భారీగా పెంచాయి. స్విగ్గీ దీన్ని మూడు రెట్లు పెంచుతూ ఆర్డర్‌కు రూ.15 చేసింది. GSTతో కలిపి ఈ అమౌంట్‌ను వసూలు చేయనుంది. జొమాటో 20% పెంచుతూ రూ.12 చేసింది. దీనికి GST అదనం. స్విగ్గీ నిత్యం 20 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తుండగా, జొమాటో 23-25 లక్షల వరకు చేస్తోంది.