News January 5, 2025
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బకరా అవ్వకు బాసూ!

SEBI వద్ద రిజిస్టర్‌కాని యాప్‌లలో పెట్టుబడులు పెట్టి బకరా అవ్వద్దని ఇన్వెస్టర్లను Cyber Crime విభాగం హెచ్చరించింది. క్విక్ మనీ, అధిక ప్రాఫిట్స్ పేరుతో మోసాలు పెరుగుతుండడంతో జాగ్రత్త వహించాలంది. సోషల్ మీడియాలో బుల్స్ స్ట్రాటజీస్ పేరుతో ఇచ్చే టిప్స్‌ను నమ్ముకొని ట్రేడింగ్ చేయవద్దని హెచ్చరించింది. ఇన్వెస్ట్‌మెంట్ మోసాలపై 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. Share It.
Similar News
News May 8, 2025
శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కనీసం 50 మ్యాచుల్లో నాయకత్వం వహించి అత్యధిక విజయశాతం కలిగిఉన్న కెప్టెన్‌గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ విజయశాతం 59.4% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్(58.9%), సచిన్(58.8%), ధోనీ(58.4) ఉన్నారు.
News May 8, 2025
లాలూ విచారణకు రాష్ట్రపతి అనుమతి

‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈడీ విచారణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతించారు. రైల్వే ఉద్యోగుల కుంభకోణంలో లాలూతో పాటు అతని కుటుంబ సభ్యుల విచారణకు పర్మిషన్ ఇవ్వాలని 2022లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా రాష్ట్రపతి నుంచి అనుమతి లభించింది. కాగా లాలూ రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్-D ఉద్యోగాలకు భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది.
News May 8, 2025
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

ధర్మశాల వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ ఆశలను మరింత మెరుగుపరుచుకోనుంది.
DC: డుప్లెసిస్, పోరెల్, KL రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్, స్టబ్స్, మాధవ్ తివారీ, స్టార్క్, చమీరా, కుల్దీప్, నటరాజన్
PBKS: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాంశ్, ఇంగ్లిస్, శ్రేయస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, అజ్మతుల్లా, చాహల్