News August 6, 2024
‘కృష్ణా’ పరీవాహక ప్రజలకు అలర్ట్
AP: కృష్ణా నదిలో ప్రవాహం పెరగడంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదిలో పడవలు, పంట్లలో ప్రయాణించవద్దని తెలిపింది. జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. అలాగే నదిలో ఈత కొట్టడం, చేపలు పట్టడం వంటివి చేయొద్దని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరింది.
Similar News
News September 16, 2024
శుభ ముహూర్తం
తేది: సెప్టెంబర్ 16, సోమవారం
త్రయోదశి: మధ్యాహ్నం 3.10 గంటలకు
ధనిష్ఠ: సాయంత్రం 4.32 గంటలకు
వర్జ్యం: రాత్రి 10.56 నుంచి 12.22 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.26 నుంచి 1.15 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 2.52 నుంచి 3.41 గంటల వరకు
News September 16, 2024
TODAY HEADLINES
➣TG: వడ్డీ చెల్లిస్తే రూ.2లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్
➣టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
➣మా జోలికి వస్తే ఒళ్లు చింతపండు అయితది: రేవంత్
➣100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా?: హరీశ్
➣AP: మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు: జగన్
➣రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన ప్రభుత్వం
➣రాజధాని రైతులకు కోరుకున్న చోట స్థలాలు: మంత్రి నారాయణ
➣విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం కుట్ర: బొత్స
News September 16, 2024
చేతికి ఫ్రాక్చర్‌తో మ్యాచ్‌లో పాల్గొన్న నీరజ్
బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జావెలిన్ త్రో స్టార్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను తాను విరిగిన చేతితో ఆడాడని X ద్వారా వెల్లడించారు. ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డానని, ఎక్స్ రేలో తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఎముక విరిగిందని తెలిపారు. డాక్టర్ల సహకారంతో ఫైనల్ ఆడగలిగాని తెలిపారు. ఆట పట్ల అతడికున్న నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.