News August 11, 2024

ALERT: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా?

image

డెస్క్ టాప్ సిస్టమ్స్‌లో Google Chrome వాడే వారికి CERT-in హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌లో లోపాలున్నాయని, వాటిని వాడుకుని సిస్టమ్స్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసే ఛాన్సుందని తెలిపింది. క్రోమ్ బ్రౌజర్‌లో సేవ్ చేసుకున్న పాస్‌వర్డ్స్ వంటి కీలక సమాచారం తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. విండోస్, మ్యాక్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News December 6, 2025

BRSపై ఏడుపు తప్ప CM చేసిందేముంది: హరీశ్

image

TG: CM అబద్ధాల ప్రచారంతో వాస్తవాలు మరుగున పడిపోవని, KCR చేసిన సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోరని హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లుగా BRSపై ఏడ్వడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘అనాలోచిత నిర్ణయాలతో SLBCలో 8మంది ప్రాణాలు బలిగొన్నారు. కృష్ణా నీళ్లను AP అక్రమంగా తరలించుకుపోతున్నా, DPRలు రూపొందిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫుట్‌బాల్ ఆటపై ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు.

News December 6, 2025

బిగ్‌బాస్-9: రీతూచౌదరి ఎలిమినేట్?

image

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 రసవత్తరంగా మారింది. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నామినేషన్లలో ఆరుగురు ఉండగా నలుగురు సేవ్ అయ్యారు. చివరికి సుమన్ శెట్టి, రీతూ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే అంతా సుమనే ఎలిమినేట్ అవుతారని భావించగా తక్కువ ఓటింగ్ రావడంతో అనూహ్యంగా రీతూ బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది.

News December 6, 2025

మూతపడిన రామగుండం థర్మల్ స్టేషన్

image

TG: రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ మూతపడింది. 1971 అక్టోబర్‌లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్‌ 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంట్‌ జీవితకాలం ముగిసిందని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఈ యూనిట్ నుంచే విద్యుత్ సరఫరా చేశారు.