News August 11, 2024
ALERT: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా?
డెస్క్ టాప్ సిస్టమ్స్‌లో Google Chrome వాడే వారికి CERT-in హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌లో లోపాలున్నాయని, వాటిని వాడుకుని సిస్టమ్స్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసే ఛాన్సుందని తెలిపింది. క్రోమ్ బ్రౌజర్‌లో సేవ్ చేసుకున్న పాస్‌వర్డ్స్ వంటి కీలక సమాచారం తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. విండోస్, మ్యాక్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News September 8, 2024
భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణం నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
News September 8, 2024
మీకు తెలుసా: పాస్‌పోర్టుకు 4వేల ఏళ్ల చరిత్ర!
పరాయి దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. ఇప్పుడేే కాదు 4వేల ఏళ్లకు పూర్వమే ఇలాంటి విధానం ఉంది. క్రీస్తుపూర్వం 2వేల ఏళ్లనాటికి చెందిన మెసపొటేమియావాసులు దేశం దాటేందుకు మట్టి పలకల రూపంలో గుర్తింపు కార్డుల్ని తీసుకెళ్లేవారని తవ్వకాల్లో వెల్లడైంది. పురాతన ఈజిప్టు, భారత నాగరికతల్లో లేఖల్ని తీసుకెళ్లేవారు. ఇక ఆధునిక పాస్‌పోర్టుల ప్రస్థానం మాత్రం మొదటి ప్రపంచయుద్ధం సమయంలో మొదలైంది.
News September 8, 2024
ఏలియన్స్‌పై అమెరికా అధ్యయనం: మాజీ అధికారి
అమెరికా రక్షణ కార్యాలయంలో పనిచేసిన లూయిస్ ఎలిజోండో అనే అధికారి సంచలన ప్రకటన చేశారు. తమకు చిక్కిన గ్రహాంతరవాసులు, వారి నౌకపై అమెరికా అధ్యయనం చేసిందని వెల్లడించారు. ‘గ్రహాంతరవాసులు, వారి వాహనాలపై అమెరికా పరిశోధనలు జరిపింది. వాటి ఉనికి గురించి దశాబ్దాల క్రితమే తెలిసినా రహస్యంగా ఉంచుతోంది. విశ్వంలో మనం ఒంటరి కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. లూయిస్ ఆరోపణలు నిరాధారమైనవంటూ అమెరికా ఖండించింది.