News April 5, 2024

అన్నీ సమస్యలే.. మార్పు ఏది?: అజారుద్దీన్

image

ఉప్పల్ స్టేడియంలోని సమస్యలపై HCA మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ట్వీట్ చేశారు. ‘స్టేడియంలో నెలకొన్న సమస్యల నడుమ IPL 2024 మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. నీటి సౌకర్యం సరిగ్గా లేదు. అనుమతి లేకుండా లోనికి ప్రవేశిస్తున్నారు. ఇవన్నీ విమర్శకులకు కనిపించట్లేదా? బ్లాక్ మార్కెట్ పెరిగింది. CSK మేనేజ్మెంట్‌కి కూడా పాస్‌లు దొరకలేదు. మార్పు ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.

Similar News

News January 21, 2025

క్రికెట్ టూర్లలో ఫ్యామిలీ ఉండాల్సిందే: బట్లర్

image

క్రికెట్ టూర్లలో తమ వెంట కుటుంబం ఉండాల్సిందేనని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డారు. వారు వెంట ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ‘ఫ్యామిలీనే మాకు తొలి ప్రాధాన్యత. వారు మా వెంట ఉంటేనే ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. టూర్ల సమయంలో భార్యలు, కుటుంబసభ్యులు మాతో ఉండడంతో చాలా దృఢంగా ఉంటాం. క్రికెట్, ఫ్యామిలీని మేనేజ్ చేసే సత్తా ఇప్పటి క్రికెటర్లకు ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News January 21, 2025

ఇన్వెస్టర్లకు ₹6లక్షల కోట్ల నష్టం.. కారణాలివే

image

బేర్స్ దెబ్బకు దేశీయ స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. ఆరంభం నుంచీ ఆటుపోట్లకు లోనవుతున్న బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పుడు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 75,900 (-1200), నిఫ్టీ 23,039 (-310) వద్ద చలిస్తున్నాయి. దీంతో నేడు రూ.6L CR ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ 100% టారిఫ్స్ ప్రకటన, బలహీన క్యూ3 ఫలితాలు, BOJ వడ్డీరేట్ల పెంపు అంచనా, FIIs వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు.

News January 21, 2025

జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు

image

TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి, BJP నేత మాధవీలత సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జేసీపై ఆమె ‘మా’, ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాడిపత్రి జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలకు యువతులు వెళ్లొద్దంటూ మాధవి ఓ వీడియో విడుదల చేయగా, ఆమెపై జేసీ ఫైరయ్యారు. ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు.