News December 3, 2024

ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే: కూనంనేని

image

TG: ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే అని CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ‘ములుగు ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ జరపాలి. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. రేషన్ కార్డులు, పెన్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. బీఆర్‌ఎస్‌కు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కూనంనేని విమర్శించారు.

Similar News

News October 24, 2025

ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణాలు

image

*బైకును ఢీ కొట్టగానే బస్సును డ్రైవర్ ఆపకుండా కొంతదూరం తీసుకెళ్లాడు. *ఆ టైంలో బైకు పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. *మంటలను ఫైర్ సేఫ్టీ కిట్‌తో కాకుండా నీళ్లతో ఆర్పే ప్రయత్నంతో వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. *లగ్జరీ, ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. *అర్ధరాత్రి, పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడం.

News October 24, 2025

మృత్యు శకటాలుగా ప్రైవేట్ బస్సులు!

image

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మృత్యు శకటాలుగా మారాయి. 2013 అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగి 45 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇవాళ మరో ప్రమాదంలో 20కి పైగా మరణించారు. అతివేగం, నిర్లక్ష్యం, సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అమాయకులు బలి అవుతున్నారు. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల పాటు అధికారులు హడావిడి చేసినా ఆ తర్వాత తనిఖీలు చేయడం లేదు.

News October 24, 2025

ప్రమాద స్థలికి వెళ్లాలని కలెక్టర్, SPకి రేవంత్ ఆదేశం

image

చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది HYDలో ఎక్కిన ప్యాసింజర్లు ఉన్నారు. దీంతో ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలన్నారు.