News December 10, 2024
వాట్సాప్‌లోనే అన్ని పత్రాలు: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724862813501-normal-WIFI.webp)
AP: అన్ని ప్రభుత్వ శాఖలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని CM చంద్రబాబు సూచించారు. సమర్థవంతమైన పాలన అందించేలా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి అన్ని శాఖలతో అనుసంధానం చేయాలని RTGSపై సమీక్షలో ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని RTGS సమీకృతం చేసి, మొత్తం పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. కుల ధ్రువీకరణ దగ్గర నుంచి ఆదాయ, ఇతర ధ్రువపత్రాలను వాట్సాప్‌లోనే లభించేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు.
Similar News
News January 22, 2025
నేడు అనంతలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737504482963_782-normal-WIFI.webp)
AP: సినీ నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభ నేడు అనంతపురంలో నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న ఈ సభకు హీరో బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ హాజరు కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతలో నిర్వహించాలని అనుకున్నా.. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రద్దు చేశారు. ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న రిలీజైన విషయం తెలిసిందే.
News January 22, 2025
ఇవాళ్టి నుంచి JEE మెయిన్ పరీక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737505262608_81-normal-WIFI.webp)
దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో 2 సెషన్ల(ఉ.9-12, మ.3-6)లో పరీక్షలు జరగనున్నాయి. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
News January 22, 2025
ALERT.. ఇవాళ, రేపు జాగ్రత్త
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737503043066_81-normal-WIFI.webp)
తెలంగాణను చలి వణికిస్తోంది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తూ, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.