News December 5, 2024
పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే: TGPSC ఛైర్మన్

టీజీపీఎస్సీ ఛైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆయన చెప్పారు. కమిషన్ పరిధిలోని పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మవద్దని సూచించారు. నిరుద్యోగుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు.
Similar News
News November 15, 2025
గ్రేటర్లో కారు జోరు తగ్గుతోందా?

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు గ్రేటర్ హైదరాబాద్ బలంగా ఉంది. అధికారాన్ని కోల్పోయినా గ్రేటర్ HYD పరిధిలోనే 16 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత 2024 కంటోన్మెంట్ ఉపఎన్నికలో మాత్రం చతికిలపడింది. లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దించగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. తాజాగా జూబ్లీహిల్స్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో గ్రేటర్లో కారు జోరు తగ్గుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News November 15, 2025
సనాతనం అంటే ఏంటి? అది ఏం బోధిస్తుంది?

సనాతనం అంటే శాశ్వతంగా, నిరంతరం ఉండేది అని అర్థం. అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మ శాస్త్రాలు మనిషికి ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. అవి సరైన జీవన విధానం, జీవిత లక్ష్యం. ఈ రెండూ తెలియకుండా జీవించడం వ్యర్థం. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల ద్వారా ఎలా పొందవచ్చో మన శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. <<-se>>#Sanathanam<<>>
News November 15, 2025
బిహార్: ఓట్ షేరింగ్లో ఆర్జేడీనే టాప్

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఓట్ షేర్ పరంగా చూసుకుంటే తేజస్వీ పార్టీ ఆర్జేడీ(23%)దే అత్యధికం. అయినప్పటికీ ఈ పార్టీ 25 స్థానాల్లోనే గెలిచింది. అటు 20.08% ఓట్లతో బీజేపీకి అత్యధికంగా 89 సీట్లు, 19.25% ఓట్లతో జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 8.71శాతం(6సీట్లు) ఓట్లు రాగా, ఇతరులకు 17శాతం రావడం గమనార్హం.


