News December 5, 2024

పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే: TGPSC ఛైర్మన్

image

టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆయన చెప్పారు. కమిషన్ పరిధిలోని పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మవద్దని సూచించారు. నిరుద్యోగుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు.

Similar News

News February 10, 2026

యుద్ధ భయం.. 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఖమేనీ

image

USతో యుద్ధ భయం నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేశారు. ఈ నెల 8న ఎయిర్‌ఫోర్స్ కమాండర్లతో భేటీకి ఆయన హాజరుకాలేదని ఇరాన్ ఇంటర్నేషనల్ తెలిపింది. 1989లో సుప్రీంలీడర్‌ అయినప్పటి నుంచి ఈ మీటింగ్‌ను ఆయన మిస్ కాలేదు. 1979 Feb 8న ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా రుహొల్లా ఖొమేనీ(మాజీ సుప్రీంలీడర్‌)కి వాయుసేన అధికారులు విధేయత చూపడానికి గుర్తుగా కమాండర్లతో ఖమేనీ భేటీ అవుతుంటారు.

News February 10, 2026

బీటల్ మేకలు.. రోజూ 2 లీటర్లకు పైగా పాలు

image

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి

News February 10, 2026

‘తోతాపురి’ టన్ను రూ.1,05,000

image

AP: వేసవి రాకముందే మామిడి ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. రేట్లు కూడా భారీగా పెరిగి రైతులకు లాభాలు తెస్తున్నాయి. NTR(D) విస్సన్నపేట నుంచి ఎగుమతి అయిన తోతాపురి మామిడి రకానికి ముంబై మార్కెట్‌లో రికార్డు స్థాయిలో టన్ను రూ.1,05,000 రేటు పలికింది. ఉత్తరాదిన డిమాండ్ కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాగా గతేడాది సీజన్ చివరలో చిత్తూరులో తోతాపురి టన్ను రూ.12-14వేలకు పడిపోయిన విషయం తెలిసిందే.