News May 2, 2024
అన్నీ ఫ్రీ.. విజన్ లేని మేనిఫెస్టోలు(3/4)

ప్రస్తుత మేనిఫెస్టోల ట్రెండ్ చూస్తే బిడ్డ పుట్టినప్పటి నుంచి జీవిత చరమాంకం వరకు ప్రభుత్వమే పోషిస్తుంది అనే భావన కలుగుతోంది. ఇలా ఎన్నేళ్లు? పైగా ఆదాయాలతో సంబంధం లేకుండా కులాలు, మతాల వారీగా పంపకాలు మరింత ప్రమాదకరం. పనిచేయగలిగే వయసున్న వారికీ డబ్బులు పంచేస్తే.. శ్రమించే వారి సంఖ్య తగ్గుతుంది. అప్పుడు రాష్ట్రానికి ప్రయోజనమేముంది? యువత ప్రభుత్వ డబ్బులపై ఆధారపడితే భవిష్యత్తు అగమ్యగోచరమే.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 12, 2025
చిన్నస్వామిలో IPL మ్యాచ్‌లకు లైన్ క్లియర్!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ IPL మ్యాచ్‌లు నిర్వహించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జస్టిస్ డీకున్హా కమిషన్ సూచించిన భద్రతా సిఫార్సులు అమలు చేస్తే మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక క్యాబినెట్ నిర్ణయించింది. తొక్కిసలాట ఘటన అనంతరం స్టేడియం భద్రతాపరంగా అనుకూలం కాదని నివేదిక తేల్చడంతో పెద్ద ఈవెంట్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్టేడియం పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
News December 12, 2025
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు
News December 12, 2025
అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.


