News March 12, 2025
త్వరలో ఆల్ పార్టీ మీటింగ్: భట్టి

TG: దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా, దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖలు రాశారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 25, 2025
‘ఆస్కార్’ గెలుపొందిన దర్శకుడిపై దాడి

‘ఆస్కార్’ గ్రహీత, పాలస్తీనా దర్శకుడు హందాన్ బల్లాల్‌పై వెస్ట్ బ్యాంక్‌లో దాడి జరిగింది. తొలుత సెటిలర్లు దాడి చేయగా ఆ తర్వాత ఇజ్రాయెల్ బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. హందాన్‌కు తల, కడుపుపై గాయాలయ్యాయని సన్నిహితులు తెలిపారు. అయితే అతడి అరెస్టుపై ఇజ్రాయెల్ బలగాలు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ‘నో అదర్ ల్యాండ్’ పేరిట పాలస్తీనాపై హందాన్, అతడి టీమ్ రూపొందించిన డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది.
News March 25, 2025
‘గూగుల్’ గురించి ఈ విషయం తెలుసా?

‘గూగుల్’ కంపెనీ తన ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు కోసం అమలు చేస్తోన్న ఓ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. ఆ కంపెనీ ఉద్యోగి మరణిస్తే వారి భాగస్వామికి పదేళ్ల పాటు 50శాతం శాలరీని ఇస్తోంది. అలాగే వారి పిల్లల్లో ప్రతి ఒక్కరికీ 19 ఏళ్లు వచ్చేవరకు నెలకు $1,000 (రూ.84వేలు) అందిస్తోంది. ఉద్యోగి కుటుంబం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కంపెనీ అండగా నిలవడం గ్రేట్ అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. మీరేమంటారు?
News March 25, 2025
భార్యపై ‘రిప్లింగ్’ కో-ఫౌండర్ సంచలన ఆరోపణలు

అనూప్ అనే వ్యక్తితో తన భార్య దివ్య అక్రమ సంబంధం పెట్టుకుందని రిప్లింగ్ కంపెనీ కో-ఫౌండర్, TNకు చెందిన ప్రసన్న శంకర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వారి చాట్ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. అందులో ఆమె ‘కండోమ్’ గురించి ప్రస్తావించిందని ప్రసన్న తెలిపారు. మరోవైపు భర్త తనను వేధిస్తున్నాడంటూ దివ్య ఫిర్యాదు చేయడంతో ప్రసన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరికి పదేళ్ల కిందట పెళ్లి కాగా ఓ కొడుకు ఉన్నాడు.