News September 14, 2024
వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల

AP: వైసీసీ చీఫ్ జగన్ తన పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచినట్లు తెలిపారు. లీడర్ అంటే పవన్‌లా ఉండాలని, మీడియా ముందు కాగితాలు పట్టుకొని ఊగిపోవడం ఏంటన్నారు. నిజాయితీ ఉంటే ఆ పార్టీ యంత్రాంగం ప్రభుత్వ వరద సాయంలో భాగమవ్వాలన్నారు.
Similar News
News December 1, 2025
తగ్గుతున్న GST ఆదాయ వృద్ధి!

TG: రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. NOVలో ₹3910 కోట్ల GST వసూలైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024 NOVలో వచ్చిన ₹3880 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు 1% పెరిగింది. అయితే అయితే ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే నెలనెలా పెరగాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. GST-2.O అమలు చేసినప్పటి తరువాత నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు.
News December 1, 2025
ఎయిర్‌పోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం

ఇటీవల ఢిల్లీలో విమాన సర్వీసుల రద్దుకు GPS స్పూఫింగ్ కారణమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. HYD, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, అమృత్సర్, చెన్నైలకూ ఫేక్ సిగ్నల్స్ వచ్చాయన్నారు. శాటిలైట్ నావిగేషన్‌లో ఇలా జరగడంతో వెంటనే గ్రౌండ్ నావిగేషన్, సర్వైలెన్స్ యాక్టివేట్ చేశామని MP నిరంజన్ రెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ సిగ్నల్స్ సోర్స్ గుర్తించే పనిలో కేంద్రం ఉందన్నారు.
News December 1, 2025
కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్‌కు ఆ పార్టీ MP శశిథరూర్‌కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్‌కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్‌కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్‌లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.


