News September 14, 2024

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల

image

AP: వైసీసీ చీఫ్ జగన్ తన పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచినట్లు తెలిపారు. లీడర్ అంటే పవన్‌లా ఉండాలని, మీడియా ముందు కాగితాలు పట్టుకొని ఊగిపోవడం ఏంటన్నారు. నిజాయితీ ఉంటే ఆ పార్టీ యంత్రాంగం ప్రభుత్వ వరద సాయంలో భాగమవ్వాలన్నారు.

Similar News

News November 18, 2025

NRPT: రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని వినతి

image

వరి ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తెచ్చేందుకు గన్ని బ్యాగులు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో నేతలు మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. రైతులకు గన్ని బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

News November 18, 2025

లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎంకు సమన్లు

image

మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ CM, BJP నేత BS యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది FEBలో మీటింగ్ కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన 17 ఏళ్ల కూతురిని యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈక్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.

News November 18, 2025

గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

image

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్‌గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.