News June 24, 2024
గురుకులాలన్నీ ఒకేచోట.. నమూనాలను పరిశీలించిన సీఎం
TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట ఉండే విధంగా నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మిస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత కొడంగల్, మధిరలో 20-25 ఎకరాల్లో వీటిని నిర్మిస్తామన్నారు. నిన్న ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ CM పరిశీలించారు. గురుకులాలన్నీ ఒకే చోట నిర్మించడం ద్వారా కుల, మత వివక్ష తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News November 8, 2024
నార్త్ కొరియా దళాలకు భారీగా ప్రాణనష్టం: జెలెన్‌స్కీ
రష్యాకు మద్దతుగా తమపై యుద్ధానికి దిగిన ఉత్తర కొరియా దళాలకు భారీగా ప్రాణ నష్టం సంభవించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ప్రస్తుతం 11వేల మంది కిమ్ సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్స్క్ రీజియన్‌లో ఉన్నారని తెలిపారు. తాము ప్రతిఘటించకపోతే మరింత మంది సైనికులను ఆ దేశం యుద్ధంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఉ.కొ సైనికులను పంపడంపై అమెరికా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.
News November 8, 2024
విజయనగరం MLC ఉప ఎన్నిక జరుగుతుందా?
AP: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నిక నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. MLC రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్ అనర్హత వేటు వేయగా, హైకోర్టు దాన్ని రద్దు చేసింది. ఇప్పటికే ఈ స్థానంలో బై ఎలక్షన్ ప్రక్రియను ఈసీ ప్రారంభించగా, ఈ నెల 11తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నిక నిర్వహణపై స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈసీకి లేఖ రాశారు.
News November 8, 2024
ALERT.. ఇవాళ, రేపు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ప్రతి ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. APలోని బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.