News February 19, 2025
ALL TIME RECORD

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా ఇవాళ ఉదయం 7 గంటలకు 16,058 మెగావాట్ల మైలురాయిని చేరుకుంది. ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల రికార్డును రాష్ట్రం అధిగమించింది. దీంతో విద్యుత్ సరఫరాపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ఎంత పెరిగినా దానికి తగ్గట్లు సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.
Similar News
News February 21, 2025
నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం

ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకెళ్తోందంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. నీటి వాటాల కేటాయింపు, రెండు రాష్ట్రాల ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎంకే సిన్హా కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది.
News February 21, 2025
అధికారికంగా విడిపోయిన చాహల్-ధనశ్రీ?

స్పిన్నర్ చాహల్, ధనశ్రీ దంపతులు అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి డైవర్స్ మంజూరు చేసినట్లు సమాచారం. ‘45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ వారు మనసు మార్చుకోలేదు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. విడిపోయాక ఒత్తిడి నుంచి బయటపడ్డాననే అర్థంలో ధనశ్రీ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టడం గమనార్హం.
News February 21, 2025
మా దేశం విశ్వసనీయత కోల్పోయింది: పాక్ ఆర్థిక మంత్రి

ఆర్థిక అస్థిరత్వం కారణంగా తమ దేశం విశ్వసనీయతను కోల్పోయిందని పాకిస్థాన్ ఆర్థికమంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. ‘కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే అత్యవసరంగా ఆర్థిక సంస్కరణల్ని అమలుచేయాలి. ప్రస్తుతానికి ఆర్థిక సాయంగా ADB నుంచి 500 మిలియన్ డాలర్లు, IMF నుంచి బిలియన్ డాలర్లు రానున్నాయి. నిర్మాణాత్మక సంస్కరణలే దేశ ఆర్థిక ప్రగతికి, స్థిరత్వానికి దోహదపడతాయి’ అని వ్యాఖ్యానించారు.