News August 1, 2024
All Time Record: నిఫ్టీ 25K, సెన్సెక్స్ 82K బ్రేక్
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నేడు సరికొత్త రికార్డులు సృష్టించాయి. NSE నిఫ్టీ తొలిసారి 25000 మార్క్ దాటింది. 24000 నుంచి మరో 1000 పాయింట్లు పెరిగేందుకు సూచీ కేవలం 25 సెషన్లే తీసుకుంది. BSE సెన్సెక్స్ మొదటి సారి 82000 స్థాయిని అధిగమించింది. 82129 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరి 1000 పాయింట్ల కోసం 11 సెషన్లే తీసుకుంది. ఇది All Time Record.
Similar News
News October 13, 2024
రేపు మద్యం దుకాణాలకు లాటరీ
AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.
News October 13, 2024
PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ
రైల్వే నుంచి విమానాశ్రయాల వరకు 7 కీలక రంగాల సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా ‘PM గతిశక్తి’ దేశ మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో సమర్థవంతమైన పురోగతికి తోడ్పడిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆలస్యం తగ్గిందని, తద్వారా ఎంతో మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని మోదీ పేర్కొన్నారు.
News October 13, 2024
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా
శ్రేయస్ అనేక ప్రొడక్ట్ డిజైనర్ వర్క్‌ఫ్రం హోం కారణంగా ఓ సంస్థలో తక్కువ జీతానికి చేరారు. మొదటి రోజే 9 గంటలు కాకుండా 12-14 గంటలు పనిచేయాలని, అది కూడా కాంపెన్సేషన్ లేకుండా చేయాలని మేనేజర్ ఆదేశించారట. పైగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసికట్టుగా మాట్లాడడంతో శ్రేయస్ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది.