News September 2, 2024

All Time Record: 25,300 దాటేసిన నిఫ్టీ

image

స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. NSE నిఫ్టీ సరికొత్త గరిష్ఠానికి చేరుకుంది. తొలిసారిగా 25,300 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 84 పాయింట్ల లాభంతో 25,320 వద్ద చలిస్తోంది. ఇక BSE సెన్సెక్స్ 150 పాయింట్లు ఎగిసి 82,516 వద్ద ట్రేడవుతోంది. హీరోమోటో, HDFC లైఫ్, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 42:8గా ఉంది.

Similar News

News September 13, 2024

కెనడాలో ఖలిస్థానీల బాంబు దాడి: పంజాబ్‌లో NIA సోదాలు

image

కెనడాలోని భారత హైకమిషన్‌పై ఖలిస్థానీ సపోర్టర్ల బాంబు దాడి కేసులో NIA పంజాబ్‌లో సోదాలు చేపట్టింది. ఉదయం నుంచే అధికారులు కొందరి ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ చేస్తున్నారని తెలిసింది. 2023, మార్చి 23న ఒట్టావాలో హై కమిషన్ ముందు దేశవ్యతిరేక నినాదాలు చేసిన ఖలిస్థానీలు త్రివర్ణ పతాకాలు తొలగించి తమ జెండాలు పాతారు. భవంతిలోకి 2 గ్రెనేడ్లు విసిరారు. దీనిపై నిరుడు జూన్‌లో NIA కేసు నమోదు చేసింది.

News September 13, 2024

హరీశ్ రావుకు వైద్య పరీక్షలు

image

TG: భుజం గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. నిన్న అరెస్ట్, ఆందోళనల సమయంలో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు తాజాగా ఆయనకు అనుమతినిచ్చారు.

News September 13, 2024

BRS నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండి: కోమటిరెడ్డి

image

TG: BRS పార్టీ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం, ప్రభుత్వంపై BRS నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే వాళ్ల ఉద్దేశం. పదేళ్లు సెంటిమెంట్‌తో పరిపాలన చేశారు. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్లు ఓట్లేయకపోతే గెలిచేవారా?’ అని ప్రశ్నించారు.