News August 16, 2024

ALL TIME RECORD: చరిత్ర సృష్టించిన స్త్రీ-2 మూవీ

image

శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ స్త్రీ-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే ₹55.40cr వసూలు చేసింది. దీంతో హిందీలో D1 అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతి స్థానాల్లో పఠాన్(₹55cr), యానిమల్(₹54.75cr), KGF-2(₹53.95cr), వార్(₹51.60cr) ఉన్నాయి. బుధవారం ప్రీమియర్స్‌తో కలుపుకుంటే స్త్రీ-2 ₹64.80cr సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News September 12, 2024

ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలంటే?

image

* అప్పుడే పుట్టిన పిల్లలు: 18 గంటలు
* 4-11 నెలల చిన్నారులు: సుమారు 15 గంటలు
* 3-5 ఏళ్ల పిల్లలు: 13 గంటలు
* 6-12 ఏళ్ల పిల్లలు: 9-12 గంటలు
* 13-18 ఏళ్ల వారు: కనీసం 8 గంటలే
* 18-60 ఏళ్ల వారు: 7-9 గంటలు
* 60 ఏళ్లు పైబడినవారు: 7-8 గంటలు
** లేదంటే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.

News September 12, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

image

పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. CSS రూల్ 2021లో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది.

News September 11, 2024

మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి

image

తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ బులిటెన్ జారీ చేశారు. ఈ ఏడాది జులై 25న మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ అందించారు.