News June 12, 2024
కేంద్ర మంత్రులంతా కుబేరులే

PM మోదీ సారథ్యంలో 71 మందితో కొలువుదీరిన కేబినెట్లో 99% మంది కోటీశ్వరులేనని ADR వెల్లడించింది. వారి సగటు ఆస్తి ₹108 కోట్లని తెలిపింది. APకి చెందిన P.చంద్రశేఖర్(గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి) ఆస్తి అత్యధికంగా ₹5,705 కోట్లని చెప్పింది. జ్యోతిరాదిత్య-₹424 కోట్లు, అశ్వినీ వైష్ణవ్ ₹144 కోట్లు, ఇంద్రజిత్-₹121 కోట్లు, కుమారస్వామి-₹115 కోట్లు, గోయల్-₹110 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంది.
Similar News
News September 11, 2025
టీడీపీ స్ర్కిప్ట్‌నే బీజేపీ ఫాలో అవుతోంది: పేర్ని నాని

AP: హిందూ మతం ముసుగులో YCPపై బీజేపీ నేతలు మాధవ్, పురందీశ్వరి విషం చిమ్ముతున్నారని పేర్ని నాని ఫైరయ్యారు. టీడీపీ స్క్రిప్ట్‌ను BJP నేతలు కాపీ పేస్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. దీని బదులు పవన్‌లాగా పార్టీని చంద్రబాబుకు అద్దెకు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అంతర్వేది రథం ధ్వంసంపై తాము ఆనాడే సీబీఐ విచారణ కోరినట్లు తెలిపారు. TDP, బీజేపీ కలిసి ఉన్నప్పుడే APలో అత్యధికంగా ఆలయాలు ధ్వంసమయ్యాయన్నారు.
News September 11, 2025
GST సవరణ.. హోండా బైక్ ధరలు ఎంత తగ్గాయంటే?

బైక్‌లపై GST స్లాబును కేంద్రం 28 నుంచి 18శాతానికి తగ్గించనుండడంతో 350, ఆ లోపు సీసీ ఉన్న బైకులపై హోండా కంపెనీ ధరలు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.18వేల వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. దీంతో యాక్టివాపై రూ.7వేలు, డియోపై రూ.7వేలు, యాక్టివా 125పై రూ.8వేలు, హోండా షైన్ 100సీసీపై రూ.5వేలు, హార్నెట్ 2.0పై రూ.13వేలు, సీబీ350పై రూ.18,800 వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
News September 11, 2025
ASIA CUP: బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

ఆసియా కప్‌లో ఇవాళ గ్రూప్-బీ టీమ్స్ బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 రన్స్ చేసింది. నిజాఖత్ ఖాన్ 42, జీషన్ అలీ 30, యాసిమ్ 28 రన్స్‌తో రాణించారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్, టాంజిమ్, రిషాద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. 144 రన్స్ లక్ష్యంతో కాసేపట్లో బంగ్లా ఛేజింగ్ ఆరంభించనుంది.