News June 12, 2024
కేంద్ర మంత్రులంతా కుబేరులే

PM మోదీ సారథ్యంలో 71 మందితో కొలువుదీరిన కేబినెట్‌లో 99% మంది కోటీశ్వరులేనని ADR వెల్లడించింది. వారి సగటు ఆస్తి ₹108 కోట్లని తెలిపింది. APకి చెందిన P.చంద్రశేఖర్(గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి) ఆస్తి అత్యధికంగా ₹5,705 కోట్లని చెప్పింది. జ్యోతిరాదిత్య-₹424 కోట్లు, అశ్వినీ వైష్ణవ్ ₹144 కోట్లు, ఇంద్రజిత్-₹121 కోట్లు, కుమారస్వామి-₹115 కోట్లు, గోయల్-₹110 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంది.
Similar News
News March 18, 2025
స్త్రీ2, పుష్ప-2ను అధిగమించిన ఛావా

‘ఛావా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఐదో వారం హిందీలో అత్యధిక వసూళ్లు (₹22cr) సాధించిన సినిమాగా నిలిచింది. స్త్రీ-2 (₹16cr), పుష్ప-2 (₹14cr) సినిమాల్ని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో నెట్ కలెక్షన్స్ ₹562.65crకు పైగా రాగా, ప్రపంచ వ్యాప్తంగా ₹750.5crకు పైగా వచ్చాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
News March 18, 2025
మోదీతో జోక్ చేసిన న్యూజిలాండ్ ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్, మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇటీవల భారత్ CTకప్ గెలవటం మోదీ ప్రస్తావించలేదు. నేను కూడా భారత్ పై న్యూజిలాండ్ టెస్ట్ విజయాల టాపిక్ తీయలేదు. ఈ రెండు విషయాలను పక్కన పెడదామని క్రిస్టఫర్ చమత్కరించారు. దీంతో ప్రధాని మోదీ తోపాటు క్రికెటర్ రాస్ టేలర్ తదితరులు నవ్వులు చిందించారు.
News March 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 18, మంగళవారం ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.