News April 10, 2025

ఎల్లుండి వైన్ షాపులు బంద్

image

TG: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ నెల 12వ తేదీన వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసి ఉంచాలని HYD సీపీ ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

పెద్ది రిలీజ్ డేట్ అందుకే ప్రకటించలేదా?

image

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ రిలీజ్‌ను సినిమా యూనిట్‌ జూన్‌కు వాయిదా వేసింది. కానీ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే 2సార్లు పోస్ట్‌పోన్ అయిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్. జూన్‌ 4న యశ్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది. అది కూడా వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేయాలని పెద్ది యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

News April 16, 2026

ORR అలైన్‌మెంట్‌పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

AP: అమరావతి ORR నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయ, ఈశాన్య పరిధిలోని అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన PILపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ORR నిర్మాణం ఎక్కడ జరగాలో పిటిషనర్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నిపుణుల బృందం ఖరారు చేసిన అలైన్‌మెంట్లలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.

News April 16, 2026

బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

image

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>