News December 13, 2024
రాహుల్ గాంధీకి అలహాబాద్ కోర్టు సమన్లు
జోడో యాత్రలో సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. సావర్కర్ బ్రిటిష్ పాలకులకు సేవలందించారని, పింఛన్ కూడా తీసుకున్నారంటూ రాహుల్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. దీనితో ఏకీభవించిన కోర్టు అభియోగాలపై విచారణ ఎదుర్కొనేందుకు జనవరి 10న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Similar News
News January 17, 2025
రేషన్‌కార్డుల ఎంపికలో గందరగోళం.. విమర్శలు
TG: రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమకు అందజేసిన జాబితా ప్రకారం గ్రామాల్లో సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా కార్డు కోసం అప్లై చేసినా జాబితాలో పేరు లేకపోవడం ఏంటని చాలామంది సిబ్బందిని నిలదీస్తున్నారు. అర్హుల ఎంపికకు ప్రభుత్వం దేన్ని ప్రాతిపదికగా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. కులగణన ఆధారంగా సర్కార్ జాబితా రూపొందించినట్లు సమాచారం.
News January 17, 2025
చాగంటికి తిరుమలలో అవమానమంటూ వార్తలు.. ఖండించిన TTD
AP: రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను TTD ఖండించింది. ప్రవచనం కోసం పిలిపించి కార్యక్రమాన్ని రద్దు చేశారనేది అవాస్తవమని పేర్కొంది. ఆయన అంగీకారంతోనే మరో రోజుకు వాయిదా వేశామంది. చాగంటినే సాధారణ భక్తుల తరహాలో శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అసత్య వార్తలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News January 17, 2025
కరుణ్ నాయర్‌ను ప్రశంసించిన సచిన్
విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ‘7 ఇన్నింగ్స్‌లలో కరుణ్ 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం సాధారణమైన విషయం కాదు. ఇలాంటి ప్రదర్శనలు ఈజీ కాదు. దీనికోసం ఏకాగ్రత, హార్డ్ వర్క్ అవసరం. ప్రతి అవకాశాన్ని బలంగా వినియోగించుకోండి’ అని ఆయన పేర్కొన్నారు.