News December 20, 2024

అల్లరి నరేశ్ ‘బచ్చలమల్లి’ పబ్లిక్ టాక్

image

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్‌, అమృత అయ్యర్‌ జంటగా నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజైంది. మూవీ చూసిన వారు తమ అభిప్రాయాన్ని నెట్టింట పంచుకుంటున్నారు. అల్లరి నరేశ్ క్యారెక్టర్, డైలాగ్స్, పర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు. సాంగ్స్ బాగున్నాయని, బీజీఎంపై మరింత ఫోకస్ చేయాల్సిందని చెబుతున్నారు. అల్లరి నరేశ్‌ను కొత్తగా చూశామని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరికొద్దిసేపట్లో WAY2NEWS రివ్యూ!

Similar News

News January 24, 2025

ముగిసిన గ్రామ సభలు.. నెక్స్ట్ ఏంటి?

image

TG: ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల కోసం నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అధికారులు ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేసి వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే ఎంక్వైరీ చేస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

News January 24, 2025

బీఆర్ఎస్ పార్టీకి షాక్

image

TG: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. రేపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

News January 24, 2025

సైఫ్‌కు రూ.25 లక్షల బీమాపై జోరుగా చర్చ

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి రూ.25 లక్షల బీమా మంజూరు చేయడం SMలో విస్తృత చర్చకు దారితీసింది. అదే సామాన్యులకైతే ఎన్నో కొర్రీలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకున్న తర్వాత ఏదో కొంత ఇస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామాన్యులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్లైమ్ చేయరు. VVIPలకు మాత్రం ఆగమేఘాల మీద బీమా క్లెయిమ్ చేస్తారని మండిపడుతున్నారు.