News September 5, 2024

ఆహారం పడేస్తున్నారంటూ ఆరోపణలు.. కారణం అదేనా?

image

AP: వరద బాధితుల కోసం తయారు చేసిన ఆహారాన్ని కొందరు బయట పడేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏలూరు రోడ్డులో గూడవల్లి ఫ్లై ఓవర్ పైనుంచి ఆహారాన్ని పడేస్తున్న ఫొటోలను ఓ నెటిజన్ Xలో పోస్ట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం, పోలీసులను కోరారు. అయితే అది పాడైపోయిన ఆహారం కావొచ్చని, తెల్లవారుజామున పంపిన ఫుడ్ మధ్యాహ్నంకల్లా పాడైపోతోందని, ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి 3 రోజులుగా కరెంటు లేదంటూ కొందరు చెబుతున్నారు.

Similar News

News September 11, 2024

కేసీఆర్ కల సాకారమైంది: హరీశ్ రావు

image

TG: కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని, దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090కి చేరిందని వివరించారు.

News September 11, 2024

స్టార్ హీరో విడాకులు.. భార్య షాకింగ్ కామెంట్స్

image

తమిళ హీరో జయం రవి <<14058198>>విడాకులు<<>> తీసుకున్నట్లు ప్రకటించడంపై ఆయన భార్య ఆర్తి రవి విచారం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే ఈ ప్రకటన చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయమై తన భర్తతో మాట్లాడుదామని అనుకున్నా అవకాశం లేకపోయిందని వాపోయారు. తన వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ క్లిష్ట సమయంలో పిల్లల సంరక్షణపై దృష్టి పెడుతానని చెప్పారు.

News September 11, 2024

20 కి.మీ వరకూ నో టోల్.. ఇలా!

image

జాతీయ రహదారులపై 20 కి.మీ. వరకూ ఎలాంటి <<14068203>>టోల్<<>> ఛార్జీ లేకుండా ఉచితంగా వెళ్లొచ్చు. 20 కి.మీ దాటాక ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనదారులు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకోవాల్సి ఉంటుంది. టోల్ రోడ్డుపై వాహనం ఎంత దూరం ప్రయాణించిందో ఆన్ బోర్డ్ యూనిట్ల ద్వారా జీపీఎస్ కోఆర్డినేట్లు రికార్డు అవుతాయి. దీంతో టోల్ ఛార్జీ నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.