News June 4, 2024
విజయనగరంలో కూటమి క్లీన్ స్వీప్

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని TDP.. ఈ ఎన్నికల్లో మొత్తం 9 స్థానాల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపు కోట, విజయనగరంలో TDP అభ్యర్థులు గెలుపొందగా.. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన YCP ఈ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం గమనార్హం.
Similar News
News November 16, 2025
టెస్టుకు దూరమైన గిల్

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.
News November 16, 2025
తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 16, 2025
134 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భారత వాతావరణ శాఖ(IMD) 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. PhD, ME, M.Tech కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


