News June 4, 2024
విజయనగరంలో కూటమి క్లీన్ స్వీప్
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని TDP.. ఈ ఎన్నికల్లో మొత్తం 9 స్థానాల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపు కోట, విజయనగరంలో TDP అభ్యర్థులు గెలుపొందగా.. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన YCP ఈ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం గమనార్హం.
Similar News
News November 14, 2024
భయపెట్టిన క్లాసెన్, జాన్సెన్
భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ టీ20 తీవ్ర ఉత్కంఠగా సాగింది. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ 41(22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), మార్కో జాన్సెన్ 54(17బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌లో క్లాసెన్ హ్యాట్రిక్ సిక్సులతో మొత్తం 22 రన్స్ కొట్టారు. హార్దిక్ వేసిన 19వ ఓవర్లో జాన్సెన్ (4, 6, 4, 2, 6, 4) మొత్తం 26 రన్స్ బాదారు. వీరు ఔటవడంతో భారత్ <<14604651>>గెలిచింది<<>>.
News November 14, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 14, 2024
BREAKING: ఉత్కంఠ పోరులో భారత్ విజయం
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 219/6 స్కోర్ చేయగా ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 208/7 చేసింది. దీంతో భారత్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీ(107)తో రాణించారు. కాగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యం సాధించింది. తర్వాతి మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.