News June 4, 2024

ఏపీలో కూటమి హవా

image

ఏపీలో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్ప మిగతా మంత్రులందరూ వెనుకబడ్డారు. ప్రస్తుతానికి NDA కూటమి 80+ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Similar News

News November 7, 2024

ఆ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు!

image

మన పొరుగు దేశం భూటాన్‌లో నిలువ నీడ లేనివారు, బిచ్చగాళ్లు ఏమాత్రం కనిపించరు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో క్రమం తప్పకుండా చోటు సంపాదించే అక్కడ ప్రజల అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. వారికి నివాసం, భూమి, ఆహార భద్రత వంటివన్నీ చూసుకుంటుంది. దీంతో ఇతర దేశాల్లో కనిపించే సహజమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అన్నట్లు ఇక్కడ వైద్య చికిత్స ఉచితం కావడం విశేషం.

News November 7, 2024

PHOTOS: కన్నీళ్లు పెట్టుకున్న కమల మద్దతుదారులు

image

అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ తీవ్రంగా పోరాడినా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేకపోయారు. కౌంటింగ్ సందర్భంగా ఆమె ఏ దశలోనూ ట్రంప్‌ను అందుకోలేపోయారు. ఫలితాల సరళిని బట్టి కమల ఓటమి లాంఛనం కావడాన్ని మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతం అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

News November 7, 2024

అగరబత్తి పొగ మంచిదేనా..?

image

చాలామంది భక్తులు పూజల్లో అగరబత్తుల్ని విపరీతంగా వెలిగిస్తుంటారు. కానీ ఆ పొగ అంత మంచిది కాదని అమెరికాకు చెందిన NIH పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అగరబత్తుల పొగ ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. ఒక అగరబత్తిని వెలిగిస్తే 45 మి.గ్రాముల కంటే ఎక్కువ కణాలు విడుదలవుతాయని, అవి సిగరెట్‌కంటే ఎక్కువని తెలిపారు. ఆ పొగలో ప్రమాదకరమైన పలు కర్బన సమ్మేళనాలు ఉంటాయని వివరించారు.