News August 7, 2024

GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి హవా

image

AP: విశాఖపట్నం GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 10కి పది స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఏడుగురు సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. దీంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో దీని ప్రభావం ఆగస్టు 30న జరిగే స్థానిక సంస్థల MLC ఎన్నికలపై పడే అవకాశం ఉంది.

Similar News

News October 23, 2025

అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం

News October 23, 2025

ఆస్ట్రేలియన్ ప్లేయర్ రికార్డు సెంచరీ

image

ఆస్ట్రేలియన్ ప్లేయర్ గార్డ్‌నర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. WWCలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో 69 బంతుల్లోనే 15 ఫోర్లతో శతకం బాదారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఛేదనలో గార్డ్‌నర్(104*), అన్నాబెల్(98*) విజృంభించడంతో ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

News October 23, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.