News August 7, 2024
GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి హవా

AP: విశాఖపట్నం GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 10కి పది స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఏడుగురు సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. దీంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో దీని ప్రభావం ఆగస్టు 30న జరిగే స్థానిక సంస్థల MLC ఎన్నికలపై పడే అవకాశం ఉంది.
Similar News
News December 7, 2025
₹500 కోట్లు ఇచ్చినోళ్లు సీఎం అవుతారు: సిద్ధూ భార్య

₹500 కోట్లు ఇచ్చిన వాళ్లు CM అవుతారని నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూను CM అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చెప్పారు. ‘పంజాబ్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. అవకాశం ఇస్తే పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తాం. CM కుర్చీ కోసం ఇచ్చేందుకు మా దగ్గర ₹500 కోట్లు లేవు’ అని చెప్పారు. అయితే తమను ఎవరూ డబ్బు డిమాండ్ చేయలేదన్నారు.
News December 7, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News December 7, 2025
తెలుగువారి పరువు పోయింది.. రామ్మోహన్ రాజీనామా చేయాలి: అమర్నాథ్

AP: ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంత్రి రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దేశంలో తెలుగు వారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో ఆయన రీల్స్ చేసుకున్నారనే అపవాదులు వచ్చాయి. రామ్మోహన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.


