News February 17, 2025
26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంతో ఏపీ

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఏడాదికి APకి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్‌ను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.
Similar News
News March 21, 2025
IOC కొత్త ప్రెసిడెంట్‌గా కిర్స్టీ కోవెంట్రీ

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్‌గా జింబాబ్వే స్విమ్మర్, పొలిటీషియన్ కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. గ్రీస్‌లో జరిగిన 144వ IOC సెషన్‌లో కమిటీ మెంబర్స్ ఆమెను ఎన్నుకున్నారు. ఈ సెషన్‌లో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జైషా ఆమెకు విషెస్ తెలిపారు. లాస్ ఏంజెలిస్-2028 ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 21, 2025
పాస్టర్ల గౌరవ వేతనం విడుదల

AP: రాష్ట్రంలోని పాస్టర్లకు మూడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,427మంది పాస్టర్లకు రూ.12,82,78,000 నిధులు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే.
News March 21, 2025
రానున్న 3 నెలలు జాగ్రత్త: సీఎస్ విజయానంద్

AP: రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కె.విజయానంద్ సూచించారు. వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యమన్నారు. వడదెబ్బ తాకకుండా నీటిని అధికంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఈ మేరకు వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.