News October 3, 2024

11న మద్యం షాపుల కేటాయింపు: ఎక్సైజ్ శాఖ

image

AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్‌ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

కీరదోసలో ఆకుమచ్చ, వెర్రి తెగులు నివారణ

image

కీరదోసలో ఆకులమచ్చ తెగులు వల్ల ఆకులపై చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి, తర్వాత ఇవి పెద్దగా మారి ఆకు ఎండి రాలిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు వల్ల ఆకులలో ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడి, మొక్క గిడస బారి, పూత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్‌ లేదా ఫిప్రోనిల్‌ 2mlను కలిపి పిచికారీ చేయాలి.

News November 27, 2025

2030లో బంగారం విలువ ఎంత ఉండనుంది?

image

గత 25 ఏళ్లలో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. 2000లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,400 కాగా ఇప్పుడు అది దాదాపు రూ.1,25,000కి చేరింది. సుమారు 14% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 2030 నాటికి రూ.10 లక్షలు దాటే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు. అయితే పసిడి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి.

News November 27, 2025

ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

image

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్‌రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.