News October 3, 2024

11న మద్యం షాపుల కేటాయింపు: ఎక్సైజ్ శాఖ

image

AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్‌ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

Similar News

News December 12, 2025

ఐరాస అత్యున్నత పురస్కారం అందుకున్న IAS అధికారిణి సుప్రియా సాహూ

image

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ 2025’ అవార్డు అందుకున్నారు. తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో పాటు బ్లూ మౌంటెయిన్‌, ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ ది మౌంటెయిన్స్‌ 2002 వంటివి ఆమె చేపట్టారు.

News December 12, 2025

తారస్థాయికి కూటమి అరాచక పాలన: అనిల్‌

image

AP: పోలీసులను అడ్డుపెట్టుకుని TDP రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ‘కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీతో సంబంధంలేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి YSRCPపై ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండి.. సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు చేస్తోంది’ అని విమర్శించారు.

News December 12, 2025

ఇండిగోకు మరో దెబ్బ.. రూ.58.75 కోట్ల ట్యాక్స్ నోటీస్

image

విమానయాన సంస్థ ఇండిగోకు రూ.58.75 కోట్ల ట్యాక్స్ పెనాల్టీ నోటీసును ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌లోని సెంట్రల్ GST అదనపు కమిషనర్ జారీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇండిగో స్పందిస్తూ.. వివరాలను పరిశీలిస్తున్నామని అవసరమైతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపింది. ఇటీవల విమానాల రద్దు, ఆలస్యాల వివాదం మధ్య ఈ నోటీసు రావడం ఆ సంస్థపై మరింత ఒత్తిడి పెంచింది.