News November 1, 2024
గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయింపు
TG: సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 837/1లో 211 ఎకరాలు కేటాయిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. భూకేటాయింపులు జరపడంతో యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోనుంది.
Similar News
News December 9, 2024
అందుబాటులోకి ‘మీ సేవ’ మొబైల్ యాప్
TG: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ సేవ’ మొబైల్ యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందవచ్చు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్‌తో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ నెట్ సేవలనూ ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేయనుంది.
News December 9, 2024
మంగళ, శనివారాల్లో సాగర్- శ్రీశైలం లాంచీలు
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇకపై వారానికి 2 రోజులు లాంచీలు నడవనున్నాయి. ఈ ఏడాది నవంబరులో లాంచీ ట్రిప్పులను ప్రారంభించి, వారానికి ఒక లాంచీ చొప్పున 800మందిని శ్రీశైలం తీసుకెళ్లినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఇక నుంచి మంగళ, శనివారాల్లో లాంచీలు నడుపుతామని పేర్కొంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలు(12ఏళ్ల లోపు) రూ.1600, 2వైపులా రూ.3,000..రూ.2వేలుగా నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.
News December 9, 2024
గోకులం: ఉపాధి కూలీల వేతనాల వాటా పెంపు
AP: గోకులం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో పశువుల కొట్టాలు, గొర్రెల షెడ్లను నిర్మిస్తున్నారు. వీటికి అందించే ఆర్థిక సాయంలో కొంత వాటా కూలీలకు వేతనాల రూపంలో చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పశువుల కొట్టాల నిర్మాణంలో పాల్గొనే కూలీలకు 46 పనిదినాలకు గాను అదనంగా రూ.13,371లు చెల్లించనుంది. అలాగే గొర్రెల షెడ్లకు 67 పని దినాలకు గాను రూ.20,205లు వారి ఖాతాల్లో జమ చేయనుంది.