News November 16, 2024
ఒక శాతం జీఎస్టీ పెంపునకు అనుమతించండి: సీఎం చంద్రబాబు
AP: సెప్టెంబర్‌లో సంభవించిన వరదలతో విజయవాడ అతలాకుతలమైందని CM చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలిపారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర GSTపై తాత్కాలికంగా 1% సర్‌ఛార్జీని విధించే వెసులుబాటు కల్పించాలని కోరారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు ₹60వేల కోట్లకుపైగా వ్యయమవుతుందని, త్వరలోనే DPRను కేంద్రానికి పంపుతామని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2024
గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు: హెడ్ ప్రశంసలు
AUS స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ IND స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. BGT తొలి టెస్టులో 89 పరుగులు చేసిన హెడ్‌ను బుమ్రా ఔట్ చేయగా అప్పటి నుంచి దీనిపై ఆయన స్పందించలేదు. తాజాగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హెడ్ స్పందిస్తూ.. ‘నేను ఆడిన గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నానని నా మనవళ్లతో చెప్పడం కూడా బాగుంటుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
News December 2, 2024
పదవులపై ఆశ లేదు: శిండే కుమారుడు
తాను డిప్యూటీ సీఎం అవుతాననే ప్రచారంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే కుమారుడు శ్రీకాంత్ శిండే స్పందించారు. ఆ రేసులో లేనని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత నాకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ వచ్చినా తీసుకోలేదు. పార్టీ కోసం పనిచేయడానికే కట్టుబడి ఉన్నా’ అని శ్రీకాంత్ వెల్లడించారు.
News December 2, 2024
ఎల్లుండి పెళ్లి.. ప్రీవెడ్డింగ్ ఫొటోలు చూశారా?
అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఈనెల 4న హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పెళ్లికి ముందు తంతు ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. తాజాగా శోభితను పెళ్లి కూతురు చేయగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నిర్వాహకులు షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సెట్‌లో ఎల్లుండి వివాహం జరగనుంది.