News March 19, 2024

MEO-2లకు ప్రతి నెలా రూ.1,000 అలవెన్స్

image

AP: మండల విద్యాధికారి-2(MEO-2)లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా రూ.1,000 ఫిక్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు MEO-1కు ఈ సదుపాయం ఉండగా, ఇకపై MEO-2లకూ అందించనుంది. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు వీలుగా ప్రతి మండలంలో ఇద్దరు MEOలను గతేడాది ప్రభుత్వం నియమించింది. వారికి వేర్వేరుగా విధులను కేటాయించింది.

Similar News

News September 8, 2024

మరో 3 జిల్లాల్లో రేపు సెలవు

image

APలోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాజాగా 3 జిల్లాలకు సోమవారం సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ఇస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ఇప్పటికే విజయనగరం జిల్లాలో సెలవు <<14051952>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.

News September 8, 2024

ఫోన్ ఎక్కువగా వాడేవారిలో హైపర్ టెన్షన్!

image

ఫోన్‌ను అతిగా వాడటం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్-డిజిటల్ హెల్త్’లో పబ్లిష్ అయిన ఆ నివేదిక ప్రకారం.. రోజుకు 6 గంటలకంటే ఎక్కువగా ఫోన్ వాడే వారిలో హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం 25శాతానికి పైగా ఉంటుంది. దీని కారణంగా గుండె, కిడ్నీ జబ్బులు వచ్చే రిస్క్ కూడా తీవ్రంగా ఉంటోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

News September 8, 2024

భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు నమోదు

image

భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు పేర్కొంది. అతడిని ఐసోలేషన్‌లో ఉంచామని, వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను పరీక్షలకు పంపామంది. కాగా ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతో పాటు స్వీడన్, థాయ్‌లాండ్ దేశాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు 926మంది మరణించారు.