News August 4, 2024
కేరళకు రూ.25లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి సంభవించిన విపత్తుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. కేరళ నాకు ఎంతో ప్రేమను పంచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు రూ.25లక్షలు <<13769196>>విరాళంగా<<>> ఇస్తున్నా. కేరళ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.
Similar News
News September 21, 2024
హెజ్‌బొల్లా టాప్ కమాండర్ హతం
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మిలిటెంట్ల మధ్య భీకర వార్‌తో మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన అటాక్‌లో హెబ్‌బొల్లా ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ హతమయ్యాడు. 1983లో లెబనాన్ రాజధాని బీరుట్‌లోని US రాయబార కార్యాలయంపై బాంబు దాడిలో ఇతనిదే కీలక పాత్ర. అదే ఏడాది US మెరైన్ బ్యారక్స్‌పై అటాక్ చేశాడు. ఇతని ఆచూకీ చెబితే 70 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని గత ఏడాది అమెరికా ప్రకటించింది.
News September 21, 2024
రజనీకాంత్ మాటలతో నా జీవితంలో మార్పు: రానా
కష్టకాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ అండగా నిలిచారని హీరో రానా తెలిపారు. ‘వేట్టయాన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ సూపర్ స్టార్‌పై ప్రశంసలు కురిపించారు. ‘నేను గతంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యా. మళ్లీ నటిస్తానని అనుకోలేదు. ఆ టైమ్‌లో రజనీ సార్ నాతో గంటపాటు మాట్లాడి స్ఫూర్తి నింపారు. దీంతో నా జీవితంలో మార్పు వచ్చింది. అందరికీ క్లాస్‌మేట్స్, కాలేజ్‌మేట్స్ ఉంటే నాకు రజనీ హాస్పిటల్ మేట్’ అని చెప్పారు.
News September 21, 2024
సెప్టెంబర్ 21: చరిత్రలో ఈ రోజు
✒ 1862: తెలుగు మహాకవి గురజాడ అప్పారావు జయంతి
✒ 1931: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం
✒ 1979: వెస్టీండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ జననం
✒ 1939: రచయిత్రి రంగనాయకమ్మ జననం
✒ 2003: సినీ నటి కృతి శెట్టి జననం
✒ 2012: తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం
✒ అంతర్జాతీయ శాంతి దినోత్సవం
✒ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం