News January 4, 2025

నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్

image

TG: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రెగ్యులర్ బెయిల్ పూచీకత్తు సమర్పించనున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు. బన్నీ వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జు‌న్‌కు నాంపల్లి కోర్టు నిన్న రూ.50వేల చొప్పున 2 పూచీకత్తులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 6, 2025

ప్రశాంత్ కిశోర్‌కు 14 రోజుల రిమాండ్

image

JSP అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు పట్నా సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను జైలుకు తరలిస్తారు. కాగా BPSC పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రశాంత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను కోర్టులో హాజరుపర్చారు. అక్కడ బాండ్ పేపర్‌పై సంతకం చేయడానికి నిరాకరించడంతో కోర్టు రిమాండ్ విధించింది.

News January 6, 2025

Stock Market: బేర్స్ వెంటాడారు..

image

స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. ఇంట్రాడేలో రూపాయి విలువ జీవిత‌కాల క‌నిష్ఠం 85.84 స్థాయికి ప‌త‌న‌మ‌వ్వ‌డం, దేశంలో HMPV కేసులు వెలుగుచూడ‌డం, ఈక్విటీ ఔట్‌ఫ్లో న‌ష్టాల‌కు కార‌ణమయ్యాయి. Sensex 1,258 పాయింట్లు కోల్పోయి 77,964 వ‌ద్ద‌, Nifty 23,616 (-388) వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, రియ‌ల్టీ రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్ల రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

News January 6, 2025

మాటల యుద్ధం: కుమార స్వామి X సిద్ద రామ‌య్య

image

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తి కాంట్రాక్టులో 60% క‌మీష‌న్ తీసుకుంటోంద‌ని కేంద్ర మంత్రి కుమార స్వామి ఆరోపించారు. తుమ‌కూరులో కాంగ్రెస్ నేత స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం దానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌ను సీఎం సిద్ద రామ‌య్య కొట్టిపారేశారు. ఈ విష‌య‌మై కుమార స్వామి ఆరోప‌ణ‌లు చేయ‌డం కాకుండా, ఆధారాలు చూపాల‌ని డిమాండ్ చేశారు. విపక్షాలు ఉన్నది కేవలం ఆరోపణలు చేయడానికి కాదన్నారు.