News January 4, 2025
నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్
TG: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రెగ్యులర్ బెయిల్ పూచీకత్తు సమర్పించనున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు. బన్నీ వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నిన్న రూ.50వేల చొప్పున 2 పూచీకత్తులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2025
పీవీ సింధు పరాజయం
ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. వుమెన్స్ సింగిల్స్‌లో వియత్నాం క్రీడాకారిణి గుయెన్ టీఎల్ చేతిలో 20-22, 12-21 తేడాతో చిత్తుగా ఓడిపోయారు. తొలి నుంచి ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. అంతకుముందు ఇండియా ఓపెన్‌లోనూ సింధు ఓడిపోయారు.
News January 22, 2025
శారదా పీఠం భవనం కూల్చేందుకు ఆదేశాలిస్తాం: హైకోర్టు
AP: తిరుమలలోని శారదా పీఠం భవన నిర్మాణంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. భవనం కూల్చివేతకు ఆదేశాలిస్తామని తెలిపింది. అనుమతి లేకుండా నిర్మిస్తే ఏం జరుగుతుందో ఈ కేసు ఓ ఉదాహరణ కావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠాన్ని ఆదేశించింది.
News January 22, 2025
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. MSP పెంపు
జనపనార (జూట్) రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 సీజన్‌కు గాను కనీస మద్దతు ధర (MSP)ను 6% అంటే క్వింటాకు రూ.315 మేర పెంచి రూ.5,650కి చేర్చింది. దీంతో దేశవ్యాప్తంగా జూట్ ఉత్పత్తిపై సగటు ఖర్చు కన్నా రైతుకు 66% ఎక్కువ రాబడి లభిస్తుంది. 2014-15లో రూ.2400గా ఉన్న క్వింటా ధరను కేంద్రం పదేళ్లలో 235 శాతానికి పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా 40 లక్షల రైతు కుటుంబాలు జనపనార సాగు చేస్తున్నాయి.