News October 3, 2024

కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అల్లు అర్జున్

image

సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన <<14254371>>వ్యాఖ్యలపై <<>>హీరో అల్లు అర్జున్ స్పందించారు. ‘సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్కృతి, విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించకూడదు. మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వారి గోప్యతను గౌరవించాలని కోరుతున్నా’ అని ట్వీట్‌ చేశారు.

Similar News

News November 6, 2024

సిరీస్ ఆస్ట్రేలియాదే: పాంటింగ్

image

టీమ్ ఇండియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్ లేదా రిషభ్ పంత్ ఎక్కువ రన్స్ చేస్తారని తెలిపారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ అత్యధిక వికెట్లు తీస్తారని అంచనా వేశారు.

News November 6, 2024

మొన్న తిట్టారు.. ఇవాళ మెచ్చుకున్నారు: మంత్రి

image

AP: గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు విషయంలో తనను తిట్టిన CM చంద్రబాబు ఇవాళ మెచ్చుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ట్వీట్ చేశారు. ‘శెభాష్ సుభాష్ అంటూ సీఎం చంద్రబాబు మెచ్చుకోలు నాకు కొండంత బలం. మొన్న తిట్టిన ఆయన ఈరోజు భుజం మీద చెయ్యి వేసి బాగా చేశావయ్యా.. ఓటర్ రిజిస్ట్రేషన్ 90% దాటించావ్ అంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. తిట్టినా మెచ్చుకున్నా మాకు అన్ని ఆయనే’ అని సీఎంతో దిగిన ఫొటోను షేర్ చేశారు.

News November 6, 2024

OTTల్లోకి కొత్త సినిమాలు

image

ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి.
*నవంబర్ 7: సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)
*నవంబర్ 8: ఎన్టీఆర్ ‘దేవర’, రజనీకాంత్ ‘వేట్టయన్’, అనుపమ్ ఖేర్ ‘విజయ్ 69’ (నెట్‌ఫ్లిక్స్), సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ (ఆహా), బాలకృష్ణ, సూర్య ‘అన్‌స్టాపబుల్’ షో (ఆహా)