News January 11, 2025
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
TG: నాంపల్లి కోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినహాయించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీకి ఇటీవల కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2025
లోకేశ్‌ను Dy.CM చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదు: అంబటి
AP: లోకేశ్‌ను Dy.CM చేస్తానన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి అమిత్ షా ఒప్పుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘షా ఏమన్నారో మాకు తెలుసు. లోకేశ్ అన్నిశాఖల్లో వేలు పెడుతున్నారని, కంట్రోల్‌లో ఉంచమని బాబుకు సూచించారు. లోకేశ్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమయ్యాడని, స్పీడ్ తగ్గించుకోవాలని హెచ్చరించారు’ అని తెలిపారు. ఈ విషయాలు బయటికి రాకుండా కూటమి నేతలు వేరే కథలు వండి వారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
News January 19, 2025
కూటమి మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ఉద్యమం: బొత్స
AP: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని మోదీ, అమిత్ షా, చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.11వేల కోట్ల ప్యాకేజీకి ఎన్నో షరతులు పెట్టారన్నారు. దీనివెనుక ఏదో మతలబు ఉందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ జరగకుండా కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
News January 19, 2025
ఈ ఏడాది అతిపెద్ద ముప్పు ఇదే..
2024లో ఎన్నో యుద్ధాలను చూసిన ప్రపంచానికి ఈ ఏడాది కూడా ఆ ముప్పు తప్పదని ఓ రిపోర్టు వెల్లడించింది. 2025లో దేశాల వార్ కారణంగానే 23% ప్రమాదం ఉంటుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్-వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. ఆ తర్వాత వాతావరణ మార్పులు(14%), భౌగోళిక ఆర్థిక సమస్యల(8%) వల్ల ముప్పు ఉందంది. వచ్చే రెండేళ్లలో తప్పుడు సమాచార వ్యాప్తి, పదేళ్లలో తీవ్ర వాతావరణ మార్పులు ప్రమాదకరంగా ఉంటాయని పేర్కొంది.