News January 30, 2025
కార్తికేయుని పాత్రలో అల్లు అర్జున్?

‘పుష్ప-2’తో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్‌తో చేయబోతున్నారు. ఈ మూవీని హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిస్తారని, శివుడి కుమారుడు కార్తికేయుని పాత్రలో బన్నీ కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’గా కార్తికేయుని ప్రయాణం, తండ్రి శివుడిని ఆయన తిరిగి కలుసుకోవడం వంటి అంశాలను చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News February 12, 2025
వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం

TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
News February 12, 2025
సంజూ శాంసన్‌కు సర్జరీ పూర్తి

ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్ సందర్భంగా ఆర్చర్ బౌలింగ్‌లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. ఆ వేలికి తాజాగా సర్జరీ పూర్తైందని క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. సర్జరీ నుంచి కోలుకునేందుకు ఆయనకు నెల రోజులు సమయం పట్టొచ్చని తెలిపింది. ఐపీఎల్ సమయానికి సంజూ ఫిట్‌గా ఉంటారని సమాచారం. కాగా.. ఈ సర్జరీ కారణంగా ఆయన కేరళ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యారు.
News February 12, 2025
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లే లక్ష్యం: భట్టి

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో క్యాబినెట్‌లో తీర్మానం చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘శాసనసభలో బిల్లు ఆమోదించి చట్టబద్ధం చేయాలని నిర్ణయించాం. కులగణన బిల్లు కేంద్రానికి పంపి ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తాం. బీసీల రిజర్వేషన్లపై కలిసొచ్చే పార్టీలను కలుపుకొని పోతాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లే మా లక్ష్యం’ అని భట్టి స్పష్టం చేశారు.