News December 1, 2024
అల్లు అర్జున్.. నంద్యాలలో ప్రీరిలీజ్ పెట్టండి: ఎంపీ శబరి

పుష్ప-2 విడుదల సందర్భంగా ఆ మూవీ హీరో అల్లు అర్జున్పై ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు. అదే తరహాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి నంద్యాలలో ప్లాన్ చేయండి. మీరు నంద్యాలకు రావడమనే సెంటిమెంట్ మాకు బాగా పనిచేసింది. మీ పుష్ప-2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 2, 2025
iBOMMA రవిపై మరో 3 కేసులు, 14 రోజుల రిమాండ్

iBOMMA రవిని పోలీసులు మరో 3 కేసుల్లో అరెస్టు చేశారు. మంచు విష్ణు, దిల్ రాజు, తండేల్ మూవీ పైరసీ పట్ల మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే జైల్లో ఉన్న అతడికి నాంపల్లి కోర్టు మరో 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని, విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
News December 2, 2025
సమంత పెళ్లి పోస్టు.. 16 గంటల్లో 79.5 లక్షల లైక్స్

దర్శకుడు రాజ్ నిడిమోరును హీరోయిన్ సమంత రెండో <<18438537>>వివాహం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్కు 16 గంటల వ్యవధిలోనే దాదాపు 79.5 లక్షల లైక్స్ రావడం గమనార్హం. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఈ జోడీకి విషెస్ చెబుతున్నారు. రాజ్ రూపొందించిన ఫ్యామిలీమ్యాన్-2 సమయంలో సమంతతో ప్రేమ మొదలైనట్లు సినీ వర్గాలు తెలిపాయి.


